Sunday, March 30, 2008

రాష్ట్ర విభజనపై ఐటీఏ ప్రజాభిప్రాయ సేకరణ

(ఎంఎస్ఎన్ తెలుగు వెబ్ సైట్ వార్త)
ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం వేడెక్కుతున్న నేపథ్యంలో చెన్నై నగరం నుంచి తెలుగువారికి సాహితీ, సాంస్కృతిక సేవలందించే ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ దిశగా నడుం బిగించింది.

ఐటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ స్పందిస్తూ ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధాలతో పెనవేసుకుపోయిన రాష్ట్ర ప్రజలు విభజన అంశంపై తమ మనోభావాలను స్పష్టంగా వెల్లడించాల్సిన తరుణం ఆసన్నమైందని భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్ అయిన www.indiantelugu.com ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు సహా దేశవిదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులందరూ ఈ వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొని తమ అభిమతాన్ని స్పష్టం చేయవచ్చన్నారు. మే 1వ తేదీన పత్రికా ముఖంగా ఓటింగ్ ఫలితాలను ప్రకటిస్తామని నగేష్ చెప్పారు.

No comments: